Thursday, November 28, 2024

ఎస్పీఎఫ్‌ చేతికి సచివాలయం భద్రత

– సచివాలం భద్రత విషయంలో ప్రభుత్వ కీలక నిర్ణయం
– బాధ్యతల నుంచి టీజీఎస్పీ సిబ్బంది తొలగింపు

రాష్ట్ర సచివాలయం భద్రత విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బందిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ బాధ్యతను తిరిగి తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎఫ్‌)కు అప్పగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొంతకాలంపాటు సచివాలయం భద్రత ఎస్పీఎఫ్‌ చేతుల్లోనే ఉంది. అయితే సచివాలయ నూతన భవనం నిర్మాణం తర్వాత గత ప్రభుత్వం.. భద్రత విధుల నుంచి ఎస్పీఎఫ్‌ను తప్పించి టీజీఎస్పీకి ఆ బాధ్యతలు అప్పగించింది.
అయితే వివిధ కారణాల వల్ల.. సచివాలయ భద్రత బాధ్యతలను తిరిగి ఎస్పీఎ్‌ఫకు అప్పగించాలంటూ కొత్త ప్రభుత్వానికి డీజీపీ నివేదిక అందజేశారు. ఈ మేరకే ప్రభుత్వం తిరిగి ఎస్పీఎ్‌ఫకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే సచివాలయ భద్రతను అధీనంలోకి తీసుకోవాలంటూ ఎస్పీఎఫ్‌కు ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular