‘స్పిరిట్’ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరిందా? స్క్రిప్ట్ సహా అన్ని పనులు పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగా సిద్దంగా ఉన్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఇంత వరకూ పట్టాలెక్కలేదు. ప్రభాస్ రాజా సాబ్, పౌజీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో? ` స్పిరిట్` ఆలస్యమైంది. అయితే ఇక ఎంత మాత్రం ఈచిత్రం ఆలస్యం కాబోదని తెలుస్తోంది. చిత్ర ప్రారంభోత్సవానికి ముహుర్తం పెట్టేసినట్లు తెలుస్తోంది. ఉగాది సందర్భంగా చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్త వ్వడంతో? లాంచింగ్ విషయంలో డిలే లేకుండా ముందుకెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొత్త సినిమాల ప్రారంభోత్సవానికి ఉగాది రోజును గొప్ప పర్వదినంగా భావిస్తారు. భారీ ఎత్తున ఆ రోజు సినిమా ఓపెనింగ్ లు ఏటా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ కి కూడా అదే రోజున ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడానికి మాత్రం మరికొంత సమయం పడుతుందని సమాచారం. ఎందుకంటే ప్రభాస్ రాజాసాబ్ తో పాటు ఏకకాలంలోనే పౌజీ షూటింగ్ కి కూడా హాజరవుతన్నాడు. ఆ రెండు సినిమాలు సెట్స్ లో ఉండగా మూడవ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైతే? డేట్లు కేటాయించడం అసాద్యం. అందుకే` పౌజీ` షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో స్పిరిట్ `కి డేట్లు కేటాయించే అవకాశం ఉంది. `రాజాసాబ్ షూటింగ్ ఇప్పటికే క్లైమాక్స్ వచ్చేసింది. కాబట్టి ఆ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.