Wednesday, March 12, 2025

శ్రీలీల ఇది నిజమేనా?

ఏ ఇండసట్రీలోనైనా సరే ఓ అమ్మాయి.. అబ్బాయి కలిసున్నట్లైతే ముందు డేటింగ్‌ అంటూ పుకార్లు షికార్లు చేస్తాయి. అదే విధంగా శ్రీలీల
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆర్యన్‌ ఇంట్లో ఇటీవల జరిగిన ఓ పార్టీకి నటి శ్రీలీల హాజరుకావడంతో ఈ పుకారు జోరు కాస్త పెరిగింది. పలు ఫంక్షన్లకు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కలిసి హాజరకావడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆమెను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. కార్తీక్, శ్రీలీల అనుంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఎలాంటి కోడలు రావాలని మీరు కోరుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మాలా తివారీ స్పందిస్తూ.. ఓ మంచి డాక్టర్ మా ఇంటికి కోడలుగా రావాలని తమ కుటుంబం భావిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించే చేశారని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతోంది. వైద్య విద్యతో పాటే ఇండస్ట్రీలో కొనసాగుతుండడం సంతోషంగా ఉందని పలు సందర్భాలలో శ్రీలీల చెప్పుకొచ్చారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు వారిద్దరి బంధానికి తమ ఆశీస్సులు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లైంది. కాగా, దక్షిణాదిలో హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న శ్రీలీల.. అనురాగ్‌ బసు దర్శకత్వంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com