Tuesday, May 6, 2025

అయోధ్యలో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు..

ఉత్తరప్రదేశ్: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్య నగరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది.

ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 40 లక్షల మంది వేడుకలకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు ఏడు వరుసల్లో భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది.

శ్రీరామ నవమి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయా ఘాట్ జోన్, నాగేశ్వర నాథ్ జోన్, హనుమాన్ గర్హి టెంపుల్ జోన్, కనక్ భవన్ టెంపుల్ జోన్ సహా ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

భక్తుల సౌకర్యార్ధం 24 గంటల పాటు పని చేసే విధంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో అధికారులను నియమించనున్నారు. రామ జన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరాలు.. 50 చోట్ల వాటర్ కూలర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com