Thursday, April 17, 2025

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి

ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా తిరుమల లడ్డూ వివాదంపైనే చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై వివాదం చలరేగుతోంది. తిరుమల లడ్డూ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇటువంటి తరుణంలో  శ్రీరెడ్డి కూడా స్పందించింది. ఐతే ఆమె తిరుమల లడ్డూ గురించి కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా తనదైన శైలిలో ఆమె కామెంట్స్ చెయ్యడం వివాదాస్పదమవుతోంది.
హిందూత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్లు.. క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావు? అని శ్రీరెడ్డి పరుశపదజాలంతో కామెంట్ చేసింది. కమ్యూనిస్టు భావాలు అంటావ్, దీక్షలంటావ్, ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి.. అంటూ పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి రెచ్చిపోయి మాట్లాడేసింది. అసలు చెప్పులు వేసుకుని దీక్ష చేయడమేంటని ప్రశ్నించింంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓ వైపు దుమారం రేపుతుండగా.. మరోవైపు ఆయన అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com