Wednesday, November 20, 2024

లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో పవిత్రోత్సవాలు

13 సెప్టెంబర్ 2024 

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోఅత్యంత వైభవంగా మొదలైన పవిత్రోత్సవాలు ఆలయ కార్యనిర్వహణాధికారి సింగాల శ్రీనివాసమూర్తి వారి ఆధ్వర్యంలో స్థానాచార్యులు డాక్టర్ టీపి రాజగోపాల్ ప్రధానార్చకులు శ్రీనివాస్ ఆచార్యులు వైదిక సిబ్బంది వేద పండితులు నాదస్వర వేద మంత్రాలు నడుమ శుక్రవారం రాత్రి 7 గంటలకు పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో పవిత్రోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఆలయంలో సెప్టెంబర్ 13 నుంచి 16 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ 13 న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి సింగల శ్రీనివాసమూర్తి దంపతులు సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శీను బాబు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular