Tuesday, December 24, 2024

శ్రీతేజ కళ్లు తెరుస్తున్నాడని తెలిపిన వైద్యులు

ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ నటించిన తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్ హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్న శ్రీతేజ కళ్లు తెరుస్తున్నాడట. చికిత్సకు స్పందిస్తున్నాడట. ట్యూబ్ ద్వారా చిన్నారికి ఆహారం అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com