ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమా నులతో పంచు కున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు తెలిపారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వొచ్చిన సంగతి తెలిసిందే.
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిం చనున్న SSMB 29 (Working Title). ఎస్ ఎస్ ఎం బీ 29 (వర్కింగ్ టైటిల్)లో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపిక య్యారంటూ ఇటీవల వార్తలొ చ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్ వొచ్చారంటూ నెట్టింట చర్చ జరిగింది. ఆ సినిమాని ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు సినీ అభిమానులు కామెంట్లు పెడు తున్నారు.