Sunday, April 6, 2025

స్టార్‌ డైరెక్టర్లపై అభిమానుల నిరుత్సహం

ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో రకంగా ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి రెండు మూడు ఏళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌లో నిరుత్సాహం నిండిపోతుంది. డైరెక్ట‌ర్ల తీరుతో అభిమానులు విసిగిపోతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్ ఎస్ రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత కొత్త సినిమా మొద‌లు పెట్ట‌డానికి రెండున్న‌రేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. కొన్ని నెల‌ల క్రితమే సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. అలాగే త్రివిక్ర‌మ్ `అల వైకుంఠ‌పురం` త‌ర్వాత కొత్త ప్రాజెక్ట్ `గుంటూరు కారం` మూడేళ్ల త‌ర్వాత చేసారు. మ‌రోస్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ స‌న్నివేశం అలాగే ఉంది. `ఆచార్య` రిలీజ్ అయిన రెండేళ్లకు `దేవ‌ర` రిలీజ్ అయింది. `దేవ‌ర 2` ఎప్పుడొస్తుందో తెలియదు. ప్ర‌స్తుతం ఆ స్క్రిప్ట్ పైనే కొర‌టాల ప‌ని చేస్తున్నారాయ‌న‌. సుకుమార్, సందీప్ రెడ్డి వంగా కొత్త ప్రాజెక్ట్ లు ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌దు. ప్ర‌స్తుతానికి లాంగ్ బ్రేక్ లో ఉన్నారు. ఇలా స్టార్ డైరెక్ట‌ర్లు అంతా మూడేళ్ల‌కు..నాలుగేళ్ల‌కు ఒక్కో సినిమా చేయ‌డంపై అభిమానులు నిరుత్సాహం వ్య‌క్తం చేస్తున్నారు. స్టార్ హీరో డేట్లు లేవ‌ని మ‌రో హీరోతో సినిమా చేసే ఆలోచ‌న ఎందుకు చేయ‌డం లేద‌ని ప్రశ్నిస్తున్నారు. కేవ‌లం స్టార్ డైరెక్ట‌ర్లు అంటే స్టార్ హీరోల‌తోనే ప‌ని చేయాలా? టైర్ 2 హీరోలు…స‌క్సెస్ లో ఉన్న యంగ్ హీరోలతో ప‌నిచేయ‌కూడ‌దా? అలా చేస్తే వాళ్ల మార్కెట్ కి న‌ష్టం వాటిల్లుతుందా? అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మోజులో ప‌డి పేరున్న డైరెక్ట‌ర్లు అంతా అన‌వ‌స‌రంగా స‌మ‌యం వృద్ధా చేస్తున్నార‌నే వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. వ‌య‌సు మీద ప‌డే కొద్ది క్రియేటివ్ థాట్స్ కూడా త‌గ్గిపోతాయ‌ని..వ‌య‌సులో ఉన్న‌ప్పుడే చ‌క‌చ‌కా ప‌ని చేయాల‌ని అన్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. రాజ‌మౌళి కెరీర్ ఆరంభంలో గొప్ప చిత్రాలు చేసి మ‌ధ్య‌లో `మ‌ర్యాద రామ‌న్న` లాంటి సినిమా కూడా చేసి హిట్ అందుకున్నారు. అలాగ‌ని ఆయ‌న ఇమేజ్ ఏం త‌గ్గ‌లేదే! సుకుమార్ స్టార్స్ తో ప‌నిచేసి కూడా చిన్న సినిమాల్లోనూ క్రియేటివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు. ఇలా అందరు డైరెక్టర్లు అందరు హీరోలతో చేస్తే బావుంటుందని అభిమానుల కోరిక.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com