Saturday, April 19, 2025

స్టార్‌ హీరో..హీరోయిన్‌ ఇగోతో… ఆగిన సినిమా

అతిలోకసుందరి శ్రీదేవి.. మెగాస్టార్‌ చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉండేది. వీరిద్దరు కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈమూవీ అంటే ఇప్పటికీ క్రేజ్ పోలేదు జనాల్లలో. ఇలాంటి బ్లాక్ బస్టర్ కాంబో మధ్య ఓ సందర్భంలో గొడవలు వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా? అవును చిరంజీవి, శ్రీదేవి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఓ సినిమానే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు గొడవేంటో తెలుసుకుందాం…

వీరిద్దరి కాంబినేషన్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈసినిమా తరువాతే శ్రీదేవికి అతిలోక సుందరి అనే బిరుదు కూడా వచ్చింది. టాలీవుడ్ లో చిరంజీవి కంటేముందే స్టార్ డమ్ సాధించింది హీరోయిన్ శ్రీదేవి. ఆమె సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు చిరంజీవి. ఆతరువాత జోడీగా వీరి కాంబో సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోల జోడీగా నటించిన శ్రీదేవి ఆతరువాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా జతకట్టింది. ఇక వెంటనే బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా ఓ వెలుగు వెలిగిందీ సీనియర్ తార. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవికి, శ్రీదేవికి మధ్య గొడవలు జరిగి.. ఓ సినిమానే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా పేరు వజ్రాల దొంగ. ఈ సినిమాను శ్రీదేవి స్వయంగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారట. తనకు ఎంతో ఇష్టమైన తెలుగు సినీపరిశ్రమలో ఓ మంచి సినిమా చేయాలి అని అనుకుంది. చిరంజీవి హీరోగా సినిమా స్టార్ట్ అయ్యింది కూడా. వజ్రాల దొంగ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కాని నిర్మాతగా ఉన్న శ్రీదేవి హీరోయిన్ పాత్రను హైలెట్ చేస్తూ సినిమాను డిజైన్ చేశారట. అయితే హీరోగా ఉన్న చిరంజీవి కూడా తన పాత్ర ఇంపార్టెన్స్ తగ్గకుండా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఇక ఈ విషయంలోనే ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌లా జరిగింది. దాంతో ఈ విషయంలో ఇద్దరు తగ్గలేదట. ప్రత్యక్ష్యంగా ఎదురుపడి తిట్టుకున్నది లేదు కాని.. సినిమా విషయంలో నేనుప్రొడ్యూసర్ ని అని ఆమె.. స్టార్ హీరోను కదా అని చిరంజీవి ఎవరు తగ్గలేదు. దాంతో ఓ పాట షూటింగ్ కూడా జరిగిన తరువాత వజ్రాల దొంగ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com