Saturday, May 10, 2025

రాష్ట్ర గీతం ఆవిష్కరణ కంట కన్నీటితో అందెశ్రీ భావోద్వేగం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అంటూ వస్తున్నా జై తెలంగాణ పాట వింటూ అందెశ్రీ కంట కన్నీటితో ఆ పాటను ఆలకిస్తూ భావోద్వేవం చెందారు. పాట వింటున్నంత సేపు ఆయన కళ్లలో కన్నీరు ఆగలేదు. తెగింపు, త్యాగాల చరిత్ర కలిగిన ఈ పాటతో ఫరేడ్ గ్రౌండ్ లో అంతా మారుమోగింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com