రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9న అసెంబ్లీ మొదలుకాగా.. 16కు వాయిదా వేశారు. ఈ నెల 16 నుంచి 21 వరకు సభ సాగింది. ఈసారి సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడీవేడిగా సాగాయి. అధికార, విపక్షాల మాధ్య మాటల యుద్ధం సాగింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.