Thursday, March 20, 2025

రాష్ట్ర బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు

తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
మూల వ్యయం రూ.36,504 కోట్లు
రైతాంగానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం
రైతు భరోసాకు రూ. 18వేల కోట్లు, వ్యవసాయ శాఖకు 24.35కోట్లు
విద్య, వైద్య రంగాలకు గతేడాది కన్నా పెంపు
ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు నిధుల తగ్గింపు
ఎస్సీ, ఎస్టీ లకు నిధుల పెంపుదల
2025-2026 బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తొలుత బడ్జెట్ ప్రతులను లాంఛనంగా ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క బడ్జెట్‌ను శాసనసభలో, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రతిపాదించారు. ఇది అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధతతో కూడిన ప్రజా బడ్జెట్‌గా పేర్కొంటూ ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తామని 72 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి అన్నారు. గడిచిన 15 నెలల పాలనలో ప్రధానంగా సంక్షేమ రంగంలో తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికను బడ్జెట్‌లో ఆవిష్కరించారు.

పెరిగిన బడ్జెట్..
మొత్తం రూ.3,04,965 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే విధంగా 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉండనున్నట్లుగా డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సారి బడ్జెట్లో మాత్రం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పించారు. ఈ మేరకు రైతు భరోసాకు, వ్యవసాయ శాఖకు నిధులు గతంలో కన్నా అధికంగా కేటాయించారు.

ఆరు గ్యారంటీలకు కేటాయింపులు..
2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా రైతు భరోసా – రూ.18 వేల కోట్లు, చేయూత పింఛన్లు – రూ.14,861, ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571, మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305, గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080, సన్నాలకు బోనస్ – రూ.1,800, రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143, గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ – రూ.723, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600, విద్యుత్ రాయితీ – రూ.11,500, రాజీవ్ యువ వికాసం రూ.6000కోట్లుగా బడ్జెట్ కేటాయించారు.

గత బడ్జెట్ కన్నా హెచ్చుతగ్గులు..
గత వార్షిక బడ్జెట్ తో పొల్చితే వ్యవసాయ రంగం తప్ప మిగతా అన్ని రంగాల్లో కేటాయింపుల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. పంచాయతీ రాజ్ శాఖలో గతేడాది బడ్జెట్లో రూ.40వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి – రూ.31,605 కోట్లు కేటాయించారు. అదే విధంగా నీటిపారుదల శాఖకు గతేడాది రూ.28వేల కోట్లు బడ్జెట్ పెట్టగా ఈ సారి రూ.23,373 కోట్లు కేటాయించారు. మిగతా రంగాలన్నింటికి స్వల్పంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచారు.

పెరిగిన ఆదాయ వృద్ధి రేటు..
రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.6 శాతం ఉండగా ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్‌డీపీ రూ.16,12,579 కోట్లుగా ఉందని మంత్రి భట్టి పేర్కొన్నారు. వృద్ధిరేటు 10.1 శాతం నమోదైందని, ఇది జీడీపీ వృద్ధిరేటు కంటే ఎక్కువ అన్నారు. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 10.1 శాతం, జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం ఉండగా, దేశ జీడీపీ రూ.3,31,03,215 కోట్లుగా ఉందన్నారు. ఇక 2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ.3,79,751 ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.6 శాతం, దేశ తలసరి ఆదాయం రూ.2,05,579 కోట్లు, దేశ తలసరి ఆదాయ వృద్ధిరేటు 8.8 శాతం, దేశ తలసరి ఆదాయానికి రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు భేదం ఉందన్నారు. దేశం కన్నా రాష్ట్ర గ్రోతింగ్ వేగంగా ఉందన్నారు.

ఏ రంగానికి ఎంత బడ్జెట్‌?
వ్యవసాయ రంగానికి : రూ.24,439 కోట్లు

క్రీడలు రూ.465 కోట్లు

అడవులు.. పర్యావరణం రూ.1023 కోట్లు
దేవదాయ శాఖ రూ.190 కోట్లు
హోంశాఖ రూ.10,188 కోట్లు
చేనేత రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.3591 కోట్లు
పరిశ్రమల శాఖ రూ.3527 కోట్లు
ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రూ.774 కోట్లు
విద్యుత్‌ ‌శాఖ రూ.21,221 కోట్లు
వైద్యం, ఆరోగ్యం రూ.12,393 కోట్లు
మున్సిపల్‌ ‌పట్టణాభివృద్ధి 17,677 కోట్లు
నీటి పారుదల శాఖ రూ. 23,373 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ రూ. 5907 కోట్లు
పర్యాటక శాఖ రూ.775 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం రూ.11,405 కోట్లు
పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి రూ. 31605 కోట్లు
మహిళా శిశు సంక్షేమం రూ.2862 కోట్లు
పశుసంవర్థక శాఖ రూ.1674 కోట్లు
పౌరసరఫరాల శాఖ రూ.5734 కోట్లు
విద్యాశాఖ రూ.23,108 కోట్లు

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com