Friday, April 18, 2025

సిపిఎం నేత సీతారాం ఏచూరి మృతికి సంతాపం ప్రకటిస్తూ, నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిపిఎం నేత సీతారాం ఏచూరి మృతికి సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఏచూరి నివాసంలో వారి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బృందాకారత్ మరియు ఏచూరి కుటుంబసభ్యులతో ఎన్నో సంవత్సరాలుగా ఏచూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బడుగు – బలహీన, తాడిత – పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ఏచూరి ఆవిరళ కృషి సల్పారని పేర్కొన్నారు. ఏచూరి కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మడమే కాకుండా జీవితంలో ఆచరించారన్నారు. గొప్ప రచయిత, రాజకీయవేత్త, ఆదర్శప్రాయుడు, అజాతశత్రువు, మన తెలుగువాడు సీతారాం ఏచూరి మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తోందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.

జారీ చేసిన వారు : ప్రత్యేక అధికారి, ఏ.పీ సమాచార కేంద్రం, ఏ.పీ భవన్, న్యూఢిల్లీ

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com