Saturday, December 28, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు

తిరుమల, సెప్టెంబర్ 30:  నేటి సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు మరియు కమిషన్ సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్థంభంనకు మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపం నందు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ తో పాటు కమిషన్ సభ్యులు త్రిపర్ణ ఆదిలక్ష్మి , శ్రీమతి బి పద్మావతి ఉన్నారు.
వీరితో పాటు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, డిసిపిఓ శివ శంకర్ ఉన్నారు.
డి.ఐ పి ఆర్ ఓ తిరుపతి

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com