Friday, July 5, 2024

నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పని చేయాలి

రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్ రోస్

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్ రోస్ కోరారు. శనివారం టీజీఎన్పీడీసీఎల్ హన్మకొండ నక్కలగుట్ట కార్పొరేట్ కార్యాలయానికి సీఎండీ రోనాల్డ్ రోస్ విచ్చేసి కార్పొరేట్ కార్యాలయంలోని డైరెక్టర్లు , సీజియంలు , జియంలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రోనాల్ రోస్ మాట్లాడుతూ కొత్త సాంకేతికతను అవలంభించాలని కోరారు. నైపుణ్యత, సామర్ధ్యం పెంచుకోవాలని, వినియోదారులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించి వారికి వారధి గా నిలవాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిబద్ధత, భాద్యతతో కస్టపడి పనిచేయాలని, అనుకున్న లక్షాలను సాధించాలని కోరారు. ముందుగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి డిస్కం యొక్క పూర్తి సమాచారాన్ని వివరించారు . ఈ వివరణలో తెలంగాణ లోని 16 సర్కిళ్ల పరిధిలో 67 లక్షల వినియోగదారులకు నాణ్యమైన మెరుగైన సరఫరా అందిస్తున్నామని తెలిపారు .

ఇందులో ఆపరేషనల్ స్ట్రక్చర్ విధానాన్ని తెలుపుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్టిబ్యూషన్, సంస్థ మానవ వనరులు, సబ్ స్టేషన్ , స్కాడా గురించి, కొత్తగా చేపడుతున్న పనులను వివరించారు. సంస్థను మరింత బలోపేతం చేయడంలో కొత్త సబ్ స్టేషన్‌ల నిర్మాణం, 33 కెవి ప్రత్యామ్నాయ సరఫరా, లైను , పాత సబ్ స్టేషన్ల పునరుద్ధరణ తదితర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరింత చేరువయ్యేలా వారి సమస్యలు పరిష్కరించేలా విద్యుత్ ప్రజా వాణి చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం అన్ని సర్కిల్ , డివిజన్ , సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ బిల్లుల పైన క్యూ ఆర్ కోడ్ లను ముద్రించి ఇస్తున్నట్లు తెలిపారు.

కొత్త టెక్నాలజీ ని అందిపుచ్చుకుంటూ సబ్ స్టేషన్ ఆటోమేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మెమొంటో తో సీఎండీ రోనాల్డ్ రోస్ ని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డైరెక్టర్లు డైరెక్టర్(హెచ్‌ఎర్డి) బి. అశోక్ కుమార్, డైరెక్టర్(ప్రాజెకట్స్) టి.సదర్ లాల్, డైరెక్టర్(ఆపరేషన్) శ్రీ వి.మోహన్ రావు, డైరెక్టర్(ఫైనాన్స్) వి. తిరుపతి రెడ్డి, సి.జి.యంలు కె.తిరుమల్ రావు , టి.మధుసూదన్, కె.కిషన్, రాజుచౌహాన్, కె. ఎన్. గుట్ట, రవీంద్రనాథ్, జియం లు, ట్రాన్స్‌కో అధికారులు సీఈ పుల్లయ్య , రాంకుమార్ , ఎస్ ఈ లు , జియం లు పాల్గొన్నారు .

నక్కలగుట్ట లోని సబ్ స్టేషన్ సందర్శించిన సిఎండి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటన నేపథ్యంలో ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్ రోస్ హన్మకొండ, నక్కలగుట్ట లోని విద్యుత్ అతిధి గృహానికి విచ్చేశారు. ఈ సందర్బంగా టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. పదవి భాద్యతలు స్వీకరించి మొదటి సారిగా విచ్చేసిన సందర్బంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మొదట నక్కలగుట్ట లోని సబ్ స్టేషన్ ను తీసుకు వెళ్లి సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా విధానాన్ని పూర్తిగా వివరించారు. 220/132/33 కెవి ములుగు రోడ్ నుండి విద్యుత్ సరఫరా అవుతుందని 33 /11 కెవి నక్కలగుట్ట ఫీడెర్ నుండి సరఫరా సబ్ స్టేషన్ లో వచ్చిన సమయం, పవర్ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ, ఫీడర్ల లోడ్ వివరాలు, స్కాడా గురించిన విషయాలను రోనాల్డ్ రోస్ కి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వివరించారు.

అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మీ సేవ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ గృహ జ్యోతి పథకం గురించి వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ వారితో మాట్లాడారు. గృహ జ్యోతి లబ్ది దారులు ప్రజా పాలనలో నమోదు చేసుకుని లబ్ది పొందని వారితో మాట్లాడుతూ వారు ప్రజాపాలనలో పొరపాటుగా నమోదు కావడంవల్ల రాలేదని వివరించారు. అందరికీ గృహ జ్యోతి వర్తిస్తుందన్నారు. అక్కడికక్కడే గృహ జ్యోతి లబ్దిదారులకు వారి వివరాలను సరిచేసి గృహ జ్యోతి లబ్ది అయ్యేటట్లు చూసారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డైరెక్టర్లు డైరెక్టర్(హెచ్‌ఎర్డి) బి.అశోక్ కుమార్, డైరెక్టర్(ప్రాజెక్ట్) టి.సదర్ లాల్, డైరెక్టర్(ఆపరేషన్) వి.మోహన్ రావు, డైరెక్టర్(ఫైనాన్స్) వి. తిరుపతి రెడ్డి , హన్మకొండ ఎస్‌ఈ కే. వెంకట రమణ , డి ఈ సాంబరెడ్డి, దర్శన్ , జానకిరామ్ రెడ్డి, కె. అనిల్ కుమార్, హన్మకొండ ఏడీఈ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular