Sunday, December 29, 2024

పెన్షన్ దారులకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

  • రెండు నెలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయిన మూడో నెలలో ఒకేసారి మొత్తం చెల్లింపు.
  • పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణించిన క్రమంలో భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ మంజూరు.
  • అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి:రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుందని, రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారని, ఒకవేళ రెండు నెలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆ రెండు నెలల మొత్తాన్ని కలిపి మూడో నెలలో మూడు నెలల పెన్షన్ మొత్తం ఒకేసారి అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ పెన్షన్ ఆపివేయడం జరుగుతుందని, వారు తిరిగి యధా స్థానానికి వచ్చిన తర్వాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించడం జరుగుతుందని అన్నారు.

వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించిన పక్షంలో అతని భార్యకు మరుసటి నెలలోనే వితంతు పెన్షన్ మంజూరు చేయటం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. జిల్లాస్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి శ్రీనివాస్ ఈ ప్రకటనలో వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com