Friday, September 20, 2024

రుణాల రీ స్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలి

  • రుణాల రీ స్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలి
  • సెస్, సర్ చార్జీల్లోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరింది
  • ప్రజలకు ఉపయోగపడే పాలసీలను సిఫార్సు చేస్తాం
  • ప్రోత్సాహాకాలు ఇవ్వాలని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కోరాయి
  • 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా

రుణాల రీ స్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా అన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రజేంటేషన్ ఇచ్చిందని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అన్ని అంశాలు కమిషన్‌కు వివరించిందని పనగారియా వెల్లడించారు. తెలంగాణ ప్రణాళికలు బాగున్నాయని పట్టణాభివృద్ధిని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తారు, కానీ, తెలంగాణ పట్టణాభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సెస్, సర్ చార్జీల్లోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరిందన్నారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయాన్ని తెలంగాణ వ్యక్తం చేసిందని అందువల్ల తమకు ప్రోత్సాహకం ఇవ్వాలని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కోరాయన్నారు.

అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన అనంతరం తగిన సిఫార్సులు

ఆరో రాష్ట్రంగా తెలంగాణలో తమ కమిషన్ పర్యటిస్తోందని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అన్ని అంశాలను కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వివరించిందని ఆయన చెప్పారు. రుణాలు, రుణభారం గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధుల కేటాయింపుపై దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వినతుల్లో ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం డివిజబుల్ పూల్‌లో 41 శాతం నిధులు సిఫారసు చేసిందని ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారని, కానీ, 30 శాతం అంటున్నారని పనగారియా తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ఆయా రాష్ట్రాలు, ఆయా రంగాలకు ప్రత్యే కంగా సిఫారసు చేసిన గ్రాంట్లు మాత్రమే రాలేదని, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని చైర్మన్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తగిన సిఫారసులు చేస్తామని అరవింద్ పనగఢియా తెలిపారు. తమ సమావేశంలో రుణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించిందని, ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, వినతులు తీసుకున్నామని, రాష్ట్రా వాటా నిధుల పెంపుపై దృష్టి పెట్టాలని కోరారన్నారు. కమిషన్ సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని, కానీ, నిధులపై కేంద్రం ఆలోచన విధానాన్ని తాము ప్రశ్నించలేమన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను సిఫార్సు చేస్తామని అరవింద్ పనగారియా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Aamna Sharif latest stills

Surbhi Jyothi Glam Pics

Rashmika Mandanna New Pics

Ritu Sharma Latest Photos