శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు “”శ్రీ మహాలక్ష్మి దేవి”” రూపంలో దర్శనమిస్తున్నారు.
రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు క్యూ లైన్ ల అందిస్తున్న సౌకర్యాలపై అధికారులను మంత్రి అనగాని సత్య ప్రసాద్ అడిగి తెలుసు కున్నారు.