Friday, November 15, 2024

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ఇద్దరు వ్యక్తులు మృతి

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. దీపావళి పండగ వేళ నిడదవోలు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకోవడం పై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్..మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

మంటలు చెలరేగి గాయాల పాలైన బాధితులకు తక్షణమే అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ. ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలి వద్దకు అధికార యంత్రాంగాన్ని పంపించిన మంత్రి దుర్గేష్.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం

వారణాసి పర్యటనలో ఉన్న మంత్రి దుర్గేష్ ఎప్పటికప్పుడు బాధితులకు అందిస్తున్న వైద్యంపై ఆరా.. మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు. బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సూచించిన మంత్రి దుర్గేష్

పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్న మంత్రి దుర్గేష్. బాణాసంచా దుకాణాల యజమానులు ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచన.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular