నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రజల సామాజిక భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.శుక్రవారం ఉదయం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బును పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలా లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటించారు. పేదల కళ్లలో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కంటే ముందుగా స్థానికంగా ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి మంత్రి దుర్గేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.