రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు
అమరావతి, అక్టోబరు 14: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో సంభవించే ఆకశ్మిక వరదలను ధీటుగా ఎదుర్కొనేందుకు జలవనరులు , రెవిన్యూ శాఖల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకశ్మికంగా సంభవించే వరదల వల్ల ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా వరద నిర్వహణ కార్యక్రమాలను ముందస్తు ప్రణాళికలతో ప్రణాళికా బద్దంగా నిర్వహించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి నాలుగు రోజులపాట రాష్ట్రంలో కురువనున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు దిశ నిర్థేశం చేరన్నారన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప తదితర జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజక్టులు, వాటి పరీవాహ ప్రాంతాలతో పాటు రిజర్వాయర్లు, వాగులు, వంకలు, చెరువుల ప్రత్యేక దృష్టి సారించి ఎటు వంటి ఆకశ్మిక వరదలు సంభవించే అవకాశం లేకుండా గండ్లు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ముందస్తు ప్రణాళికలతో అప్రమ్తతంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.
ఆయా ఇరిగేషన్ ప్రాజక్టులు, రిజర్వాయర్లు, వాగులు, వంకలు, చెరువుల్లోకి వచ్చే ఇన్ ప్లోను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా తక్షణ చర్యలు చేపట్టే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయా జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లతో ఎప్పటి కప్పుడూ మాట్లాడుతూ వాతావరణ శాఖ, ఆర్.టి.జి.ఎస్. నివేదికల ఆధారంగా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా 30 రోజుల్లో కురిసే వర్షం మూడు గంటల్లోనే కురుస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారన్నారు.
శ్రీశైలం నుండి 1.31 లక్షల క్యూసెక్కుల నీరు తుంగభద్ర ప్రాజెక్టులోకి వస్తున్న నేపధ్యంలో నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ ను పర్యవేక్షించుకోవాలని సూచించారన్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 78 టిఎంసీలు అయితే మంచి నిర్వహణతో ఇప్పటికే 52 టిఎంసీల నీటిని నిల్వచేసుకోవడం జరిగిందని, మిగిలిన 26 టిఎంసీలకు మించి ఆ ప్రాజక్టులోకి నీటిని రానీయకుండా ముందస్తు ప్రణాళికలతో తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. 2017 లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్నా నది అనుసంధానమైన ఉన్న పలు వాగులు పొంగిపొర్లడం వల్ల నెల్లూరు పట్టణం ముంపుకు గురైందని, అటు వంటి సమయంలో తాను మూడు రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు రానవడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. గత అనుభవాల దృష్ట్యా, ప్రస్తుతం ఎటు వంటి విపత్తులు సంభవించకుండా ముందస్తు ప్రణాళికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.
జలవనరుల ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్య దోరణి వల్ల పలు జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటాయన్నారు. అయితే మంచి అనుభవం, దూర దృష్టి ఉన్న రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో వరద మరియు నీటి నిర్వహణను పటిష్టంగా నిర్వహించడం వల్ల పలు రిజ్వాయర్లల సామర్థ్యం 762 టిఎంసీలు కాగా ప్రస్తుతం 666 టిఎంసీల నీరు అంటే 87 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రతి ఏడాది సాధారణంగా 30 నుండి 35 టిఎంసీల నీరు నిలువ ఉండేదని, అయితే మేము అధికారంలోకి వచ్చేపాటికి ఆ ప్రాజెక్టులో కనీసం అర టిఎంసీ నీరు కూడా నిల్వఉండకపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో అధిక వర్షాలు, తుఫానుల వల్ల పడే ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి ఆఖరి ఎకరం వరకు సాగు, త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలను రూపొందించి వచ్చే నెల నుండి అమలు పర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని, గతంలో నిర్లక్ష్యం చేయబడిన ప్రాజక్టుల మరమ్మత్తులను ప్రాధాన్యతా క్రమంలో వచ్చే నెల నుండి చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ఈ అంశంలో రెండు మూడు సార్లు స్థానిక మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేసి ప్రస్తుతానికి 80 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులను కూడా రానున్న పదిపదిహేను రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను నవంబరు నుండి ప్రారంబిస్తామని, సి.డబ్య్లు.సి., పి.పి.ఐ. షెడ్యూలు కంటే ముందుగానే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకునేందుకు నేడు కాంట్రాక్టు సంస్థలు,అధికారులతో పోలవరంపై సమీక్ష చేస్తున్నామని మంత్రి తెలిపారు.