Tuesday, May 13, 2025

స్ట్రీమింగ్ కు రెఢీ అయిన “హరికథ”

సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ “హరికథ” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొచ్చింది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. “హరికథ” వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ “హరికథ” సిరీస్ కు దర్శకత్వం వహించారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “హరికథ” వెబ్ సిరీస్ లో వైవిధ్యమైన కథా కథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్, సీజీ వర్క్, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్ వంటి మెయిన్ లీడ్ యాక్టర్స్ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. హాట్ స్టార్ కు మరో సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ను అందిస్తూ “హరికథ” ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com