వికారాబాద్ జిల్లా తాండూర్‌లో విషాదం నెలకొంది. ఐదు నెలల పసికందును పెంపుడు కుక్క పీక్కుతిన్నది. గౌతాపూర్‌లోని నాపరాతి పాలిష్ యూనిట్‌లో దత్తు, లావణ్య అనే దంపతులు కూలీలుగా పని చేస్తున్నారు. అయితే పాలిషింగ్ యూనిట్ యజమాని ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ కుక్క దత్తు కుమారుడు సాయినాథ్(5 నెలలు)పై దాడి చేసి చంపింది. దాంతో ఆగకుండగ ఆ పసికందును కండ కండలు పీక్కుతిన్నది. దీంతో బిడ్డను కోల్పోయామన్న బాధలో దత్తు అతని భార్య కలిసి పెంపుడు కుక్కపై దాడి చేసి చంపారు. సాయినాథ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చనిపోయిన బిడ్డను గుండెలకు హత్తుకుని రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది.