Wednesday, April 2, 2025

ఫిట్ నెస్ లేని విద్యాసంస్థల బస్సులపై కఠిన చర్యలు

  • 60 ఏండ్ల వయస్సు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించరాదు
  • డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్

ఫిట్ నెస్ లేని విద్యా సంస్థల బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధులను రవాణా చేసే విద్యా సంస్థలు తమ బస్సులను తప్పనిసరిగా ఫిట్ నెట్ కలిగి ఉండాలని ఆయన తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తం గా 11922 విద్యా సంస్థ ల బస్సు లు ఉంటే ఇప్పటి వరకు కేవలం 8917 బస్సు లు మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయని, మిగిలిన 3005బస్సు లు కూడా సంబంధిత రవాణా శాఖ కార్యాలయం లో ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని ఆయన తెలిపారు.

15 సంవత్సరాలు దాటిన విద్యా సంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల లో రోడ్ల పై తిరగరాదని, 15 సంవత్సరాలు దాటిన బస్సు లు, ఫిట్ నెస్ లేని బస్సుల లో విద్యార్థులను రవాణా చేస్తే ఆ వాహనాలను సీజ్ చేయడమే కాకుండా యాజమాన్యాలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ హెచ్చరించారు. బస్సు మంచి కండిషన్ లో ఉంచడం తో పాటు అనుభవజ్ఞులైన వ్యక్తులను డ్రైవర్లగా నియమించాలని ఆయన సూచించారు. నిబంధల ప్రకారం 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించరాదని ఆయన సూచించారు.

ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా లో 5725 బస్సులకు 4363 బస్సులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో 5985 బస్సులకు 4468 బస్సులు వికారాబాద్ జిల్లా లో 212 బస్సులకు 86 బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉన్నాయని మిగిలిన బస్సులు కూడా త్వర లో ఫిట్ నెస్ చేసుకోవాలని ఆయన తెలిపారు.అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల లో ఆ బస్సు లను రోడ్ల పై తిప్పరాదని తెలిపారు. త్వరలో విద్యాసంస్థ ల యాజమాన్యాలతో, డ్రైవర్ల తో సమావేశం నిర్వహిస్తామని డి టి సి చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com