తన ఫోన్ తీసుకున్నావంటూ ఓ ఉపాధ్యాయురాలిపై విద్యార్థిని చెప్పుతో దాడి చేసింది. క్లాస్ రూంకు మొబైల్ ఫోన్ తీసుకురావడం, గంటల తరబడి ఫోన్‌లో ఉండటం, క్లాసులు వినకపోవడంతో ఆగ్రహానికి వచ్చిన ఆ లెక్చరర్.. ఫోన్ లాక్కుంది. విశాఖలోని రఘు కళాశాలలో ఈ ఘటన జరిగింది. కాలేజీకి ఫోన్ తీసుకొచ్చిన విద్యార్థినికి.. లెక్చరర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్ తీసుకువచ్చి వేషాలు వేస్తున్నారని, ఫోన్ ఇప్పుడు ఇవ్వనని లెక్చరర్ మందలించారు. అయితే, పదేపదే మీదకు వస్తుండటంతో.. చెప్పు తెగుద్ది అంటూ లెక్చరర్ హెచ్చరించారు. దీంతో సదరు విద్యార్థిని కూడా నా ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం పెరిగి.. ఫక్షన్ ఇవ్వనంటూ లెక్చరర్ అనడంతో.. స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది.