Tuesday, November 19, 2024

ఇంత హై షేర్సా?

ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాల రేంజ్‌ చాలా వరకు పూర్తిగా మారిందని చెప్పవచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు తెలుగు మూవీ అంటే కంటెంట్ లేని కమర్షియల్ సినిమాలు అనే ప్రచారం ఉండేది. అయితే బాహుబలి సిరీస్ తరువాత పూర్తిగా తెలుగు చిత్రాల పై ఒక గౌరవం వచ్చిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని పూర్తిగా బాహుబలి చిత్రం తుడిచేసింది అని చెప్పవచ్చు. బాహుబలితో రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మిగిలిన డైరెక్టర్స్ కూడా బలమైన కథలని కమర్షియల్ జోనర్ లో చెప్పొచ్చని డిసైడ్ అయ్యారు. దర్శకుల ఆలోచనా విధానం బాగా మారింది. నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ లు పెట్టి సినిమాలు చేయడానికి భయపడటం లేదు. ఎంత బడ్జెట్‌ అయినా పర్వాలేదని చిత్రాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. దానికి తగ్గట్లుగానే బలమైన కథ, కథనాలు ఉన్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాల జాబితాలో టాప్ 1 లో ఆర్ఆర్ఆర్ నిలిచింది.బఈ సినిమా ఏకంగా 272.31 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తరువాత బాహుబలి 2 మూవీ ఉంది. ఈ చిత్రం 204 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చేసింది. మూడో స్థానంలో గత ఏడాది డార్లింగ్ ప్రభాస్ నుంచి వచ్చిన సలార్ 150 కోట్ల షేర్ తో నిలవడం విశేషం. తరువాత స్థానాలలో అల వైకుంఠపురంలో 130.17 కోట్లతో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ 117.50 కోట్ల షేర్ తో ఐదో స్థానంలో ఉంది. ఇక పోతే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయిన చిత్రాల్లో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా వండర్స్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో 89.50 కోట్ల షేర్ ని సొంతం చేసుకొని టాప్ 10 జాబితాలోకి వచ్చి చేరింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం యావరేజ్ టాక్ తో కూడా 90.53 కోట్ల షేర్ సొంతం చేసుకోవడం ద్వారా టాప్ 10 జాబితాలోకి చేరింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే.. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ వసూళ్లు చేసిన టాప్ 10 సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది. ఆర్ఆర్ఆర్ – 272.31కోట్లు బాహుబలి 2 – 204కోట్లు సలార్ – 150.73కోట్లు అల వైకుంఠపురంలో – 130.17కోట్లు సరిలేరు నీకెవ్వరూ – 117.50కోట్లు వాల్తేరు వీరయ్య – 115.10కోట్లు బాహుబలి -: 114కోట్లు సైరా నరసింహారెడ్డి – 106.4కోట్లు రంగస్థలం – 95.27కోట్లు గుంటూరు కారం – 90.53కోట్లు సర్కారువారిపాట – 90.07కోట్లు హనుమాన్ 89.50కోట్లు ఆదిపురుష్ – 86.25కోట్లు పుష్ప – 85.35కోట్లు.

ఇక కథలో దమ్ముంటే చాలు స్టార్‌డమ్‌తో సంబంధం లేదన్నట్లు కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ కలెక్షన్లు కొల్లగొడితే… మరికొన్ని చిత్రాలు ఆ హీరో సినిమా థియేటర్‌లో విడుదలైతే చాలు మినిమమ్‌ ఓపెనింగ్స్‌ వచ్చేస్తాయి. కలెక్షన్లకు ఢోకా లేదు అనే రేంజ్‌లో నేటి తరం చిత్రాలు కలెక్షన్లు ఉంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular