జక్కన్నతో సినిమా చేయడానికి మహేష్ రెఢీ అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాలు నిర్మాణం జరుపుకోబోతున్న ఈ సినిమా ఒక భాగంగా వస్తుందా? రెండు భాగాలుగా వస్తుందా? అనే విషయంలో ఇంకా రాజమౌళి స్పష్టతనివ్వలేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి సంయుక్తంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. రానున్న కాలంలో బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉందికానీ తగ్గేదే లేదు అంటున్నారు చిత్రు యూనిట్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమా మహేష్ బాబే చేయాల్సి ఉంది. ఈ తరహా క్యారెక్టర్ తరకు సెట్ అవదన్న ఉద్దేశంతో ప్రిన్స్ దీన్ని తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. వంశీ రెండేళ్లు ఎదురు చూశాడు మహర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనతో ఈ సినిమా చేయడానికి వంశీ రెండు సంవత్సరాలు ఎదురు చూశారని, ఏ దర్శకుడికీ అన్ని సంవత్సరాలు ఎదురుచూసే ఓపిక ఉండటలేదన్నారు. ఈ వేడుకలో సుకుమార్, పూరీజగన్నాథ్ పేర్ల గురించి ప్రస్తావన రాకపోవడంతో తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మహేష్ బాబు తాను వంశీ ఎదురు చూశాడనే విషయాన్ని చెప్పానుకానీ దర్శకుడు సుకుమార్ ను మాత్రం పాయింట్ చేయలేదని, కౌంటర్ ఇవ్వలేదని స్పష్టత ఇచ్చారు. రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నారు హీరోలు వేరే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కథలు పట్టుకొచ్చిన దర్శకులకు రెండు నెలలు లేదంటే మూడు నెలలు కనీసం వెయిట్ చేయాలంటూ చెబుతుంటారు. కొందరు ఎదురుచూస్తారు.. మరికొందరు వేరే హీరోను చూసుకుంటారు. పుష్ప సినిమా కోసం కూడా ఇలాగే జరిగింది. రెండు నెలలు ఆగాలని మహేష్ బాబు కోరగా, అంతవరకు ఆగడం ఇష్టంలేని సుకుమార్ అల్లు అర్జున్ తో దీన్ని తీశారు. అయితే తాను సుకుమార్ ను ప్రత్యేకంగా పాయింట్ చేసి కౌంటర్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయని, తాను అలా అనలేదని ఆ సందర్భంలో మహేష్ బాబు వివరణ ఇచ్చారు.