Wednesday, February 12, 2025

సమ్మర్‌ హాట్‌

లైట్‌‌ బీరు రూ.180, స్ట్రాంగ్‌‌ బీరు రూ. 200

తెలంగాణలో మందుబాబులకు తాగకుండానే మత్తెక్కుతుంది. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచుతూ సోమవారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి ధరలు పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీరు రూ. 150గా ఉండగా… స్ట్రాంగ్ బీరు రూ. 160గా ఉంది. ఇప్పుడు 15 శాతం ధరలు పెరగనుండటంతో రూ.150 ఉన్న లైట్‌‌ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్‌‌ బీరు ధర రూ. 200 వరకు పెరుగింది. కేసు లైట్‌‌ బీర్లు తీసుకోవాలంటే రూ. 2160 అవుతుంది. ఇక కేసు స్ట్రాంగ్ బీర్లు తీసుకోవాలంటే రూ. 2400 అవుతుంది. ఇప్పుడు పెరిగిన బీర్ల రేట్లతో ప్రతినెలా దాదాపుగా రూ. 300 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా. రాబోయేది సమ్మర్ కావడం, దీనికి తోడు ఐపీఎల్ కూడా ఉండటంతో బీర్ల సేల్స్ మరింత పెరగనున్నాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్​ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఎక్సైజ్ శాఖఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పెరిగిన ధరలు మంగళవారం నుంచి అంటే ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.
మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) లో రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని కాంగ్రెస్ సర్కారు అంచనా వేసింది. ఏప్రిల్‌‌,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యూటీ ద్వారా రూ.9 వేల 493 కోట్లు, వ్యాట్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రూ.8 వేల 40 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి సరాసరిగా రూ.90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు సగటున రూ.2,700 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com