Friday, April 18, 2025

అంతరిక్ష కేంద్రం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్‌

భారత సంతతి వ్యామగామి సునీతా విలిమమ్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికా ఎన్నికల్లో ఆమె అంతరిక్షం నుంచి తన ఓటు వేయబోతున్నారు. 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ దాదాపు 3 నెలలుగా అక్కడే చిక్కుకున్న సంగతి తెసిసిందే. వీళ్లిద్దరు ఐఎస్ఎస్‌కు బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో వెళ్లారు. ఆ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీ కారణంగా వారి తిరుగుయాత్రకు ఆటంకం ఏర్పడింది.

బోయింగ్ స్టార్‌ లైనర్‌ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారు ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. దీంతో అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకుని సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు సునికా విలియమ్స్, విల్ మోర్ లు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com