Friday, December 27, 2024

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కు అస్వస్థత- చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (73) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి నుంచి రజనీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ కు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు చికిత్స అందిస్తున్నారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రజనీకాంత్ ఆరోగ్యంపై స్పందించిన ఆయన సతీమణి లత .. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరా తీశారు. తన స్నేహితుడు రజనీ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రజనీకాంత్ ప్రస్తుతం వేట్టయాన్‌, కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com