Friday, April 4, 2025

ఇంత ఘోరమా..?

3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేస్తారా..? : సుప్రీం కోర్టు సీరియస్‌

హెచ్​సీయూ (హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ) భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హెచ్​సీయూ రిజిస్ట్రార్​కు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదికను అందజేయాలని హెచ్​సీయూ రిజిస్ట్రార్​కు స్పష్టం చేసింది. కేవలం 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడంపై సీరియస్‌ అయింది. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అటవీ భూమి (ఫారెస్ట్​ ల్యాండ్​) అని ఆధారాలు లేవని న్యాయస్థానానికి తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

కంచ గచ్చబౌలి భూముల పనులపై హైకోర్టు స్టే
హైదరాబాద్​ కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్​, హెచ్​సీయూ విద్యార్థులు దాఖలు చేసిన పిల్​( ప్రజా ప్రయోజన వ్యాజ్యం)పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైదరాబాద్​ సెంట్రల్​ వర్సిటీ తరఫున ఎల్​. రవిశంకర్​ వాదనలు వినిపించారు. కంచ గచ్చిబౌలి భూముల పనులను ఇవాళ్టి వరకు ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. హెచ్​సీయూ భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిల్‌ వ్యాజ్యాలపై కౌంటర్ల దాఖలుకు ఏజీ గడువు కోరారు. ఏజీ విజ్ఞప్తి మేరకు విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. ఈనెల 7 వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే ఇవ్వడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో రణరంగాన్ని తలపిస్తోంది. దీంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధాన గేటు వద్ద పోలీసుల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. హెచ్‌సీయూ గేటు దూకి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. లోపల జరుగుతున్న పనులను అడ్డుకుంటామని ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. చదును చేస్తున్న భూమి వద్దకు 200 మంది ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com