Thursday, December 26, 2024

సీఎం రేవంత్​ రెడ్డికి సుప్రీం నోటీసులు

టీఎస్​ న్యూస్​: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని సూచనలు చేసింది. గతంలో ఈ కేసులో ఏసీబీ అధికారులు రేవంత్‌ను అరెస్ట్ చేశారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వ‌చ్చారు. అయితే, మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com