Monday, April 21, 2025

కవితకు మళ్లీ నిరాశే బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈడీ, సీబీఐ దాఖలు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ బెంచ్ ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమన్న కోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.కోర్టు నిర్ణయంతో బీఆర్ఎస్ ఆశలు ఆవిరి

సోమవారం కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఫిక్స్ అయ్యారు. కానీ కోర్టు నిర్ణయంతో నిరుత్సాహానికి గురయ్యారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత వారం కేటీఆర్, హరీశ్ ఢిల్లీ వెళ్లి కవిత బెయిల్​పై న్యాయకోవిదులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో కవితకు వచ్చేవారం బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో కవితకు బెయిల్ రావడం ఖాయమనే ప్రచారం నడిచింది. అయితే కోర్టు షాకిచ్చింది.

కోర్టు నిర్ణయంపై సస్పెన్స్

ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె ఆశలన్నీ అత్యున్నత న్యాయస్థానంపైనే ఉన్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఏప్రిల్ 11న సీబీఐ, మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ఇటీవలే సుప్రీం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కవితకు కూడా కచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. వచ్చే వారం కోర్టు బెయిల్​పై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్​గా మారింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com