Thursday, September 19, 2024

సీఎం రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. . విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది.

పిటిషనర్ తరపు వాదనలు..
* ఈ కేసులో ఎలాంటి ట్రయల్ జరగడం లేదు
* ఈ కేసులో నిందితుడే(రేవంత్‌) ప్రస్తుతం ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్నారు
* రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
* పోలీసుల సంగతి తెలుస్తామన్నారు

‘ఓటుకు నోటు’ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విచారణ ఇక్కడ నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని, ఈ కేసును మధ్యప్రదేశ్‌కు లేదా ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు సుప్రీంకోర్టులో జనవరి 31న పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం డివిజన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది.

– పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ.. ఇది ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి సంబంధించిన తీవ్రమైన కేసని. 2015 నుంచి ఈ కేసు నడుస్తుంటే.. నిందితుడుగా ఉన్న రేవంత్‌ రెడ్డి కోర్టులు జారీచేసిన వివిధ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విచారణను అడ్డుకుంటున్నారని కోర్టుకు తెలిపారు.

– ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌కు కూడా బదిలీ చేయొద్దని, అక్కడ కూడా ఆయన ప్రభావం ఉందని చెప్పారు. ‘‘కొందరు పోలీసు అధికారుల పేర్లను రెడ్‌ డైరీలో రాసుకున్నామని, వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని రేవంత్‌రెడ్డి గతంలో హెచ్చరించారు’’ అని కూడా కోర్టుకు తెలిపారు.

– అన్ని ప్రాసిక్యూషన్లు, కేసును ఛేదించిన ఏసీబీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి చేతుల్లో ఉంటాయని, అందువల్ల ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ రాజీపడే ప్రమాదం ఉందన్నారు.

– ఈ నేపథ్యంలో కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు.

ధర్మాసనం వ్యాఖ్యలు
* ఈ కేసు విచారణకు ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తాం
* విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్ ను నియమిస్తాం
* 2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారు.. ఎందుకు?
* న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకం ఉంది
* అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమిస్తాం
* కేసు విచారణను ముగిస్తున్నాం
* ఏపీ లేదా తెలంగాణ నుంచి ఒకరిని స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తారు
* మధ్యాహ్నం రెండు గంటలకు ఆదేశాలు జారీ చేస్తాం

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular