హీరో సూర్య మెగా-ఎంటర్‌టైనర్ ‘సూర్య 45’ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మల్టీ ట్యాలెంటెడ్ ఆర్జే బాలాజీ ఈ మాగ్నమ్ ఓపస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ లోకి వెల్ కం చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్ లో త్రిష చరిస్మాటిక్ ప్రజెన్స్ కట్టిపడేసింది. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలని త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.