టాలీవుడ్..బాలీవుడ్ ఏదైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా విచ్చలవిడి తనం ఉంటుంది అంటారు చాలా మంది. అదో రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎవరితో స్నేహంగా ఉంటారో ఎవరు ఎవరితో గొడవలు పడతారో తెలియదు. అదే విధంగా ప్రేమలు..వివాహాలు కూడా అంతే.. అంతలోనే ప్రేమిస్తారు మళ్ళీ అంతలోనే బ్రేకప్లంటారు. అక్కడ అంతా దాదాపుగా విచిత్రమైన సంబంధాలు ఉంటాయి. ఇకపోతే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రేమాయాణాలు..వాటి బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పది మందితో రిలేషన్ షిప్ బ్రేకప్ అయింది. ప్రస్తుతం 11వ నెంబర్ లో లలిత్ మోడీ ఉన్నాడా? లేడా? అన్నది తెలియదు.
రోహమాన్ షాల్ కి బ్రేకప్ చెప్పిన అనంతరం జీవితంలోకి లలిత్ మోదీని ఆహ్వానించింది. అతడిని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో సుస్మిత ప్రేమ కహానీలకు ఇక్కడితో పుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ మళ్లీ పెళ్లి ఊసు రాలేదు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట లీక్ అవ్వలేదు. ఆ రిలేషన్ షిప్ కూడా బ్రేకప్ అయిందా? అన్నది ఓ సందేహం. ఇదే సమయంలో పక్కనబెట్టిన మాజీని మళ్లీ లైన్ లోకి తెస్తుందా? అన్న సందేహం వచ్చేలా అప్పట్లో ఓ డౌట్ క్రియేట్ చేసింది. సుస్మితా సేన్-రోహమాన్ షాల్ ఇద్దరు జంటగా షాపింగ్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవ్వడంతోనే ఈ సందేహం వచ్చింది.
కానీ అది నిజమవ్వలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుస్మితా సేన్ తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా జీవితం తెరిచిన పుస్తకం. నిజాయితీగా జీవించడం ఇష్టం. మనం తీసుకునే నిర్ణయాలు బాధపెట్టాయా? తప్పు చేసామా? అన్నది పట్టించుకోను. ఒకవేళ ఎవరినైనా పెళ్లి చేసుకున్నా.. నా మాజీ లవర్లతో స్నేహంగానే మెలుగుతాను. కానీ అది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా చేస్తాను. ఎందుకంటే ఎదుట వారిని నొప్పించాలన్నది నా మనస్తత్వం కాదు. కొన్ని ప్రయాణాలు కొంత కాలమే కొనసాగుతాయి. ఆ తర్వాత ఏవో కారణాలతో బ్రేక్ అవుతుంటాయి. అంత మాత్రానా? ఎదుట వారిని నొప్పించకూడదు అన్నది నా అభిమాతం` అని తెలిపింది.