Saturday, March 22, 2025

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’

గుడిపల్లి రుషి కిరణ్ కుమార్, ఘట్టమనేని శ్వేత, శిరిగిలం రూప, మర్రెబోయిన శివ యాదవ్, ఎరుగురాల రజిత తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ది సస్పెక్ట్’. టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో చిత్రం హీరో కం ప్రొడ్యూసర్ గుడిపల్లి రుషి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. దీనికి డెబ్యూ దర్శకుడు రాధాకృష్ణ రచన, దర్శకత్వం అందించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైం థ్రిల్లర్ తో ఆడియన్స్ ఏమాత్రం ఎంగేజ్ అయ్యారో రివ్యూలో చూద్దాం పదండి.

కథ: అర్జున్(గుడిపల్లి రుషి కిరణ్ కుమార్)… ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనికి మీరా(ఘట్టమనేని శ్వేత) అనే అమ్మాయితో ప్రేమలో వుంటారు. అయితే అర్జున్ డ్యూటీలో బిజీగా వుండి శ్వేతను నిర్లక్ష్యం చేయడతో ఆమె వేరే వాళ్లను వివాహం చేసుకుని వెళ్లిపోతుంది. అయితే సిటీలో ప్రత్యూష (శిరిగిలం రూప)అనే విద్యార్థిని దారుణ హత్యకు గురవుతుంది. ఆ బాలిక హత్యకు కారకులైన హంతకులను పట్టుకోవడం అర్జుక్ అప్పజెప్పుతారు. అతని టీమ్ లో సదా శివ(శివ యాదవ్) కూడా వుంటారు. వీరిద్దరూ ఛాలెంజ్ గా తీసుకుని ఈ కేసును ఛేదించే క్రమంలో వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి వ్యక్తి వారి ‘సస్పెక్ట్’గానే కనిపిస్తుంటారు. మరి ఈక్రమంలో వారు అసలైన దోషులను ఎలా గుర్తించారు? చివరకు హంతకుల జీవితం ఎలా ముగిసిందనేదే మిగతా కథ.

కథ.. కథనం విశ్లేషణ: మర్డర్ మిస్టరీ సినిమాలకు మంచి ఆదరణ వుంటుంది. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు.
‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేస్తూనే ఉంటుంది. ఒక క్రైం సీన్ చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే… చివరి వరకూ హంతకులెవరు అన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్ తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. కానీ మరోకోణంలో వారు కాదు… మరొకరున్నారనేది చివరి వరకూ కొనసాగుతూ వస్తుంది. ఇక ప్రీక్లైమాక్స్ లో అసలు హంతకులు ఎవరు అనేది తెలియడంతో… ఆ పాత్రపై జాలి కలగడంతో పాటు… ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టుంది. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదని… ముఖ్యంగా విద్యార్థులుగా వున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే… వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి… ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది ఇందులో చూపించారు. సినిమా మొత్తం ఓ మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరుగుతూ ఆడియన్స్ ను ప్రతి సెకెనూ ఎంగేజ్ చేస్తుంది సినిమా.

ఫస్ట్ హాఫ్ లో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, వారి లవ్ బ్రేకప్ తరువాత మళ్లీ కలుసుకోవడం లాంటి సన్నివేశాలతో ఇంటర్వెల్ కార్డ్ వేసి… ఆ తరువాత హీరో మిత్రుడు, తోటి సహచరుడు సదా శివ చనిపోవడంతో సినిమా సెకెండాఫ్ లో ఊపందుకుంటుంది. ఇక చివరి దాకా సినిమాను ఆసక్తికరమైన మలుపులతో నడిపించి చివరకు ముగించడంలో దర్శకుడు విజయం సాధించారు.

కొత్త ఆర్టిస్టులైనా ఎంతో అనుభవం ఉన్న వారిలా బాగా పర్ ఫార్మ్ చేశారు. హీరో రుషి కిరణ్… ఇన్స్ పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెప్పించారు. క్రైంను చేధించే క్రమంలో డిపార్ట్ మెంట్ వారు చూపించే యారెగెన్సీని ఇందులో బాగా చూపించారు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత కూడా గ్లామరస్ గా కనిపించింది. హోమ్లీ లుక్ లో మెప్పించింది. ప్రత్యూష పాత్రలో నటించిన రూప కూడా బాగా చేసింది. అలాగే లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హీరో సహచరునిగా నటించిన మరో పోలీసు అధికారి పాత్ర మర్రెబోయిన శివకుమార్… సదా శివ పాత్రలో బాగా నటించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే చివరి వరకూ ఎంగేజింగ్ గా వుంది. దాంతో ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ గ్రాండియర్ గా వున్నాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. క్రైం థ్రిల్లర్ కి ఎలావుండాలో అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా వున్నాయి. ఈ జోనర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్. ఈ వారం సరదాగా చూసేయండి.
రేటింగ్: 3

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com