Friday, April 4, 2025

ఆగస్ట్ 9న సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’

అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ‘భవనమ్’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

ఆగస్ట్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ‘ది హాంటెడ్ హౌస్‌’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రంలో సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు హ్యుమర్, ఫ్యామిలీ ఫన్ కూడా ఉండబోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఎక్సయిటింగ్ కంటెంట్ తో ఈ సినిమాని తీర్చిదిద్దారు. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి వీరి పాత్రలన్నీ చాలా అద్భుతమైన ఎంటర్ టైనర్ మెంట్ ని అందించబోతున్నాయి.

ఈ చిత్రంలో గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మురళీమోహన్ రెడ్డి ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా వరతై ఆంటోని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com