Thursday, May 8, 2025

మదర్‌ సెంటిమెంట్‌తో పాటు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కలియుగ పట్టణంలో’

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ అంది. ఈ క్రమంలో దర్శకుడు రమాకాంత్ రెడ్డి నేడు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. ఊరిపేరు కాదు. మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి అనే కథ ఇది.

ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి చూపిస్తాము. నంద్యాల దగ్గర్లోనే నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. కథలో ఫారెస్ట్ కి, ఔషధ మొక్కలకు లింక్ ఉంటుంది. అందుకే నంద్యాలలో చేసాము. ఈ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ఉంటుంది. దాంతో పాటు లవ్, యాక్షన్, ఒక మెసేజ్ కూడా ఉంటుంది. హీరో మెంటల్ హాస్పిటల్ లో ఉన్న దగ్గర్నుంచే కథ మొదలవుతుంది. దాన్ని తెరపై చూస్తే బాగుంటుంది. బయట చాలామంది తండ్రులు సోషియో ఫోబియాతో ఉన్నారు. నా కొడుకు ఇలా ఉండాలి, ఇది చేయాలి, సమాజం ఏం అంటుందో అనే ఆలోచిస్తారు. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరు. వాటికి తగ్గట్టు కథలో ఆ పాయింట్ కూడా ఉంటుంది. బయట ఇలాంటివి చాలా చూస్తున్నాము. గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ ప్రగ్నెంట్ లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది.

నేను ప్రగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదు అని చెప్తే, ఆమె.. మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది. ఇక నేను మాట్లాడలేదు. ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతుంది. అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది. అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం. దాంతో ఈ కథ రాసుకున్నాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమా తీశారు. అప్పుడు షూటింగ్ లో నేను అసిస్టెంట్ గా పనిచేసాను. అక్కడ్నుంచి సినిమా ఇంట్రెస్టు బాగా పెరిగింది. ఆ తర్వాత వైజాగ్ లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ, కొన్ని సినిమాలకు పనిచేసాను. కరోనాలో ఫిక్స్ అయి కరోనా తర్వాత పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. కోడి రామకృష్ణ దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి పలువురు దర్శకుల వద్ద పనిచేసాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేసాను.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com