Monday, January 6, 2025

‘స్వప్నాల నావ’.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం

డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపీ కృష్ణ కొటారు .. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదటి ప్రయత్నంగా తన కుమార్తె శ్రీజ కొటారు పాడి, నటించిన ‘‘స్వప్నాల నావ’’ వీడియో చిత్రీకరణను ప్రారంభించారు. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా రూపొందిస్తున్న ఈ పాటని ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ పాటకు పార్ధసారధి నేమాని స్వరాలు సమకూర్చగా.. యశ్వంత్ సాహిత్యం అందజేశారు. ప్రముఖ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య చిత్రీకరణ చేశారు. ఈ మ్యూజిక్ వీడియోకి బుజ్జి.కే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పూర్తిగా అమెరికాలోని డల్లాస్‌ నగరంలో చిత్రీకరించిన స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భగా జరిగిన వీడియో లాంచ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని నిర్మాత గోపీకృష్ణ కొటారు, కుమారి శ్రీజ కొటారును అభినందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందన్నారు గోపీకృష్ణ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com