Friday, September 20, 2024

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక 

• 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎపి అభివృద్ధే లక్ష్యం
• ఈనెల 21 నుండి ప్రజల నుండి సూచనలు,సలహాలు,అభిప్రాయాల సేకరణ
• అక్టోబరు 5వరకు మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు
• అక్టోబరు 5వరకు పాఠశాలల,కళాశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీలు
• సెప్టెంబరు 30 నాటికి మండల ప్రణాళికలు ఖరారు కావాలి
• జిల్లా ప్రాధాన్య అంశాలు ఆధారంగా అక్టోబరు 15లోగా జిల్లా ప్రణాళికలు 
• నవంబరు 1న స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రణాళిక ఆవిష్కరణ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.
అమరావతి,19 సెప్టెంబరు:కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి నవంబరు 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరుబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూప కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై  గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలక్టర్లు,వివిధ శాఖాధిపతులు,కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏడాదికి 15శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాధ్ర @2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు.2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దడంతో పాటు 43 వేల డాలర్లకు పైగా తలసరి ఆదాయంతో కూడిన 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈవిజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నట్టు సిఎస్ పేర్కొన్నారు.
ఎపి 974 కి.మీల పొడవుగల సుముద్రతీర ప్రాంతాన్ని కలిగి ఉందని ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మూలపేట,గంగవరం,రామాయపట్నం,కృష్ణపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని సిఎస్ చెప్పారు.పోర్టు ఆధారిత పరిశ్రమలు  కూడా తీరప్రాంత జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయని ఎగుమతి,దిగుమతులకు పెద్దఎత్తున అవకాశాలు కలుగ నున్నాయని చెప్పారు.వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా పెద్దఎత్తున అభివృద్ధి చెందుతోందని కావున బ్లూ ఓషన్ ఎకానమీని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఐదేళ్ళ కాలానికి జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు.అదే విధంగా ప్రభుత్వ ప్రాధాన్యాలైన జీరో పేదరికం,ఈజ్ ఆఫ్ లివింగ్,సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి,డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్,డేటా సెంటర్,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు వంటి గ్రోత్ ఇంజన్లు వంటి జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఉదాహరణకు అరకు కాఫీ వంటి జిల్లా ప్రాముఖ్యం కలిగిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు.అదే విధంగా జిల్లా ప్రణాళిక ఆధారంగా చేసుకుని మండల స్థాయిలో  ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేయాలని చెప్పారు.
ముఖ్యంగా గ్లోబల్ హై వ్యాల్యూ అగ్రీ అండ్ ప్రోసెసింగ్ పవర్ హౌస్,పరిశ్రమ ఆధారిత నైపుణ్య పెంపుదల విద్య,తూర్పు తీరంలో లాజిస్టిక్స్ కేంద్రంగా ఎదగడం,పారిశ్రామిక మరియు పునరుత్పాదకాలకు కేంద్రంగా ఎపిని తీర్చిదిద్దడం వంటి అంశాల ప్రాధన్యతతో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.అలాగే అత్యున్నత నాణ్యత,నెక్స్ట్ జనరేషన్ స్వర్వీసెస్ హబ్ గాను,ప్రధాన పర్యాటక కేంద్రంగాను,వృద్ధి కేంద్రాలుగా మహా నగరాలు,సాంకేతికతతో కూడిన అందుబాటులో ఉండే వైద్యం,గౌరవ ప్రదమైన సురక్షిత,ఉత్పాదక జీవితం,వాతావరణం,మొదట ప్రాధాన్యతగా అభివృద్ధి విధానం,సుస్థిర ప్రభుత్వం,డిజిటల్ సుపరిపాలన,స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్ధిక వ్యవస్థ,ఆర్ధిక విధానంతో కూడిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించేందుకు ప్రజల నుండి సూచనలు,సలహాలు,స్పందనను తీసుకోవడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సంబంధించి ప్రజలు వివిధ స్టేక్ హోల్డర్ల నుండి సూచనలు,సహాలు,అభిప్రాయాలు,స్పందనను తెల్సుకునేందుకు క్యూఆర్ కోడ్ తో కూడిన ముసాయిదా డాక్యుమెంట్ ను ఈనెల 21 నుండి అక్టోబరు 5వరకు ఐటి విభాగం ద్వారా ప్రభుత్వ వెబ్ సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.అనంతరం అక్టోబరు 5లోపు వివిధ వర్గాల నుండి అనగా లీడ్ డిస్ట్రిక్ మేనేజర్లు,ఇండస్ట్రియల్ చాంబర్ అసోసియేషన్లు,రైతులు సంఘాలు,ఆక్వా సంఘాలు తదితరుల నుండి ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటామని సిఎస్ తెలిపారు.
అదే విధంగా ఈనెల 21 నుండి అక్టోబరు 5లోగా స్వర్ణాంధ్ర @ 2047పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మండల,మున్సిపల్,గ్రామ పంచాయితీ స్థాయిల్లో అవగాహనా సదస్సులను నిర్వహించడం జరుగుతుందని సిఎస్ వెల్లడించారు.అలాగే జిల్లా కలక్టర్ల స్థాయిలో రైతులు,ప్రముఖ వ్యక్తులు,వివిధ చాంబర్ల,ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాన్నారు.అంతేగాక జిల్లా స్థాయిలో ఎంపి, ఎంఎల్ఏ,ఎంఎల్సి తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలక్టర్లను సిఎస్ ఆదేశించారు.స్వర్ణాంధ్ర @ 2047పై విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు ఈనెల 21 నుండి అక్టోబరు 5వ తేదీల మధ్య వివిధ పాఠశాలల,కళాశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు వ్యాస రచన,వ్యకృత్వ తదితర పోటీలను నిర్వహించాలని జిల్లా కలక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు.
స్వర్ణాంధ్ర @ 2047లో భాగంగా ఈనెల 30 నాటికి మండల ప్రణాళికలను సిద్దం చేయాల్సి ఉందని,అక్టోబరు 15 నాటికి జిల్లా విజన్ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.తదుపరి అక్టోబరు 16-20 మధ్య స్వర్ణాంధ్ర @ 2047 ముసాయిదా ప్రణాళికను నీతి ఆయోగ్ ఖరారు చేశాక అక్టోబరు చివరి వారంలో స్వర్ణాంధ్ర @ 2047 ముసాయిదాపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రెంజెంటేషన్ చేసి వారిచ్చే సూచనలు,సలహాలను పరిగణలోకి తీసుకున్నాక అక్టోబరు 28న స్వర్ణాంధ్ర @ 2047 డాక్యుమెంట్ ను ఖరారు చేసి నవంబరు 1వ తేదీన స్వర్ణాంధ్ర @ 2047ను లాంచనంగా ఆవిష్కరించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.
స్వర్ణాంధ్ర @ 2047 పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ వార్డు సచివాలయాలు,పిఆర్ అండ్ ఆర్డి,ఎంఏయుడి,పోలీస్,రెవెన్యూ,విద్యా శాఖల పరిధిలోని వారి మొబైల్ ఫోన్లకు వాట్స్ ప్ సందేశాలు పంపాలని సిఎస్ ఆదేశించారు.అలాగే ప్రణాళిక, సమాచార శాఖల ద్వారా పోస్టర్లు,హోర్డింగ్లు,వీడియో డాక్యుమెంట్ల ప్రదర్శనతో పాటు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు.
అంతకు ముందు రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ స్వర్ణాంధ్ర @ 2047 ప్రణాళిక ఉద్ధేశ్యాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు.విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్,ఉన్నత విద్యాశాఖ,ఐటిశాఖ కార్యదర్శి సౌరవ గౌర్ స్వర్ణాంధ్ర @ 2047 కు ఆయా శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు.పలువురు జిల్లా కలక్టర్లు వీడియో సమావేశంలో మాట్లాడుతూ వారి జిల్లాల్లో ప్రాధాన్యత ప్రముఖ్యత కలిగిన అంశాల ఆధారంగా ఐదేళ్ళ జిల్లా కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఇంకా ఈసమావేశంలో ఎంఎయుడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ హరినారాయణ,పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కృష్ణ తేజ,మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి,ఆశాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి,ప్రణాళికాశాఖ జెఎస్ అనంత శంకర్ తదితర అధికారులు,వర్చువల్ గా వివిధ శాఖల కార్యదర్శులు,శాఖాధిపతులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos