మండలిలోని తన చాంబర్‌లో ప్రమాణస్వీకారం
చేయించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో గెలుపొందిన నారకుంట నవీన్ కుమార్ రెడ్డి, వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్)లు గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్‌లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఏ పదవి చేయలేదని తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించిన అందరికి ధన్యవాదాలని ఆయన అన్నారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లకు కృతజ్ఞతలని, బాధ్యత గలిగిన వ్యక్తిగా ఉంటానని ఆయన చెప్పారు.