ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా ఈ కుందనపు బొమ్మ.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే ఓ మూవీ ప్రమోషన్ లో ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఇన్ డైరెక్ట్ గానే రిలేషన్ షిప్ పై అనౌన్స్ మెంట్ ఇచ్చేలా క్యాప్షన్ పెట్టింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆ విషయంలో సైతం రాజ్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇక అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేసిందా అనే టాక్ నడుస్తోంది. ఏం పోస్ట్ చేశారంటే..? రీసెంట్ గానే సమంత నిర్మాతగా వ్యవహరించిన “శుభం”సినిమా రిలీజ్ అయ్యింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రీయా కొంతం, చరణ్ పేరి ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ నుంచే రాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్న సామ్.. సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను, మూవీ టీంతో పాటు పోస్ట్ చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ అండ్ డీకే. వారి డైరెక్షన్ లోనే వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సామ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సిరీస్ తోనే సామ్ జీవితం టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి. ఆ మూవీలోని కొన్ని సీన్స్ కారణంగానే సామ్, చైతన్యకు విభేదాలు వచ్చాయని.. అందుకే విడాకులు కూడా తీసుకున్నారని అంటుంటారు. అంతే కాకుండా ఆ సమయంలోనే రాజ్- సమంత మధ్య పరిచయం కాస్త ప్రేమకు దారితీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చైతూతో విడాకులు అనంతరం అనారోగ్యం అంటూ సైలెంట్ గా ఉన్న సామ్.. ఇక ఇప్పుడు కాస్త మామూలుగా అయ్యారని భావిస్తున్నారు. అందుకే ఎప్పుడూ రాజ్ తో కలిసి కనిపిస్తోంది సమంత. పికిల్ బాల్ టోర్నమెంట్‌లో ఒకరి చేయి ఒకరు పట్టుకుని సామ్- రాజ్ కలిసి ఉండడం ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది.