బిజెపిపై సరికొత్త వీడియోను విడుదల చేసిన కాంగ్రెస్
తాత..నీకు టాటా.. అంటూ బిజెపిపై సరికొత్త వీడియోను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై వినూత్నమైన ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ఈ వీడియో విడుదల చేసింది.
ALSO READ: స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న అరుణ్ రెడ్డి అరెస్టు
విభజన చట్టాల అమల్లో వైఫల్యం, వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు నిర్లక్ష్యం, 2020లో హైదరాబాద్ వరదల సమయంలో కేంద్రం ఎలాంటి సాయం అందించకపోవడం, ఐటిఐఆర్ లాంటి అనేక అంశాల్లో తెలంగాణకు బిజెపి అన్యాయం చేసిందని ఈ వీడియోలో పేర్కొన్నారు. పదేళ్లు తెలంగాణకు ద్రోహం చేసింది చాలు తాతా.. నీకు టాటా అంటూ రూపొందించిన ఈ వీడియో వైరల్ గా మారింది.