పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా టి -కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్ నియమిస్తూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిండెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసిసి ఇన్‌చార్జీలుగా రోహిత్ చౌదరి, పిసి విష్ణునాథ్‌లు వ్యవహారించనున్నారు.
టి కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు వివరాలు ఇలా…
ఖమ్మం -పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నల్గొండ- ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి- శ్రీధర్‌బాబు
వరంగల్- రేవూరి ప్రకాశ్‌రెడ్డి,
మహబూబాబాద్ -తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్- ఒబెదుల్లా కొత్వాల్
సికింద్రాబాద్- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
భువనగిరి- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆదిలాబాద్- సీతక్క
జహీరాబాద్- దామోదర్ రాజనర్సింహ
నిజామాబాద్- సుదర్శన్ రెడ్డి
మెదక్- కొండా సురేఖ
నాగర్‌కర్నూల్- జూపల్లి కృష్ణారావు
మహబూబ్ నగర్- సంపత్ కుమార్
చేవెళ్ల- వేం నరేందర్ రెడ్డి
మల్కాజిగిరి మైనంపల్లి