Thursday, January 16, 2025

కాంగ్రెస్‌కు 13 సీట్లు పక్కా….!

  • మిగిలిన 4 సీట్లలో గెలుపు అటుఇటుగా…
  • సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల
  • అభిప్రాయాన్ని సేకరించిన టిపిసిసి
  • ఓటింగ్ సరళి, అభ్యర్థుల బలాబలాలను
  • విశ్లేషించుకున్న టిపిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్
  • పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాలతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి రేవంత్
  • రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలింగ్ తీరుపై ఆరా

రాష్ట్రంలో అధిక సీట్లను గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. అందులో భాగంగా పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని, ఓటర్లు తమ ప్రజాపాలనను ఆశీర్వదించారన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 13 సీట్లు పక్కాగా వస్తాయని మిగిలిన 4 సీట్లలో గెలుపు అటుఇటుగా ఉందని టిపిసిసి ఫలితాలను విశ్లేషించుకుంటోంది. ఇప్పటివరకు ఉన్న సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుస్తామన్న అంచనాకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే మంగళవారం టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడి పోలింగ్ జరిగిన తీరును సమీక్షించారు. అన్ని చోట్ల ఓటింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా జరిగిందని, వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేం దుకు ప్రజలు మొగ్గు చూపారని నేతలు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమయ్యిందని వారు ఒక అంచనాకు వచ్చారు.

4 నియోజకవర్గాల్లో ఫలితాలు అంచనాకు అందడం లేదు….
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగు తుందని వారు ధీమాతో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.40 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే 4 నుంచి 5 శాతానికి మించి పార్టీ ఓటు బ్యాంకు తప్పకుండా పెరుగుతుందని పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. వివిధ సర్వేల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 13 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పక్కాగా గెలిచే అవకాశాలున్నాయని వారంతా ఒక అంచనాకు వచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఫలితాలు అంచనా వేసేలా లేవని అభిప్రాయానికి వచ్చింది.

కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి రెండో స్థానానికి పోటీ పడిందని, బిఆర్‌ఎస్ ఎక్కడ కూడా పోటీలో కనిపించలేదని తమకు అందిన సమాచారాన్ని వారంతా విశ్లేషించుకున్నారు. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడీ అంచనాకు చిక్కలేదన్న అభిప్రాయానికి వారు వచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com