Thursday, December 26, 2024

తెలంగాణలో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనన్న శ్రీనివాస్ గౌడ్

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం అన్నది సర్వసాధారణం. విపక్షంలో ఉన్నవారు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నవారిని ఎత్తిచూపాలనే చూస్తుంటారు. ఏదో ఒక విషయంలో తప్పుబడుతూనే ఉంటారు. బీఆర్‌ఎస్‌నేత మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవుడి ముందు అందరూ సమానమేనని అన్నారు. వివక్ష చూపడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనని అన్నారు. వ్యాపారాల్లో, పదవుల్లో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క మనుషులంతా ఒకటే అంటూ వివక్ష చూపకూడదని అంటూనే తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంత వరకు కరెక్ట్‌ అని కొంత మంది సోషల్‌ మీడియలో అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com