Wednesday, November 27, 2024

తమిళనాడులో ఫెంగల్‌ తుఫాన్‌ -స్కూళ్లకు సెలవు

నైరుతిలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి నేడు తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ తుపానుకు ‘ఫెంగల్’గా నామకరణం చేసింది. తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో మయిలాదుతురై, తిరువారూర్, నాగపట్టణం, చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పేట్, కడలూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) పేర్కొంది. దీంతో చెన్నై, చెంగల్‌పేట్, కడలూర్, మయిలాదుతురై ప్రాంతాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. నాగపట్టణం, మయిలాదుతురై, తిరువారూర్‌ ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా రేపటి వరకు ఓ మాదిరి వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడలూర్, మయిలాదుతురైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ నిన్ననే రెడ్ అలెర్ట్ జారీచేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular