Saturday, December 28, 2024

కాగడ చేతపట్టి “తమ్ముడు” వచ్చేస్తున్నాడు

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. “తమ్ముడు” సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. “తమ్ముడు” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగడా చేత పట్టిన నితిన్, భుజానికి పాపను ఎత్తుకుని పరుగెడుతూ రావడం, ఆయనతో పాటు ఊరి ప్రజలు కూడా కాగడాలతో వెంటే వస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ “తమ్ముడు” సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com